జనసేనలోకి చిరంజీవి... నాడు రూ.5వేల కోట్లకు పార్టీ విలీనం : KA Paul

by Disha Web Desk 21 |
జనసేనలోకి చిరంజీవి... నాడు రూ.5వేల కోట్లకు పార్టీ విలీనం : KA Paul
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఫలితమో ఏమో తెలియదు గానీ సినీ ఇండస్ట్రీయే కాదు రాజకీయం కూడా ఆయన చుట్టూనే తిరుగుతుంది.మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేతలు, మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తుంటే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు, టీడీపీకి చెందిన నేతలు మాత్రం చిరంజీవికి మద్దతుగా పలుకుతున్నారు. దీంతో ఇప్పుడు ఏపీలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీలో చేరేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీలో చేరి తమ్ముడికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే మెగాస్టార్ చిరంజీవి లీకులు ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి జనసేనలో చేరతారని తాను ముందే ఊహించినట్లు వెల్లడించారు. సిగ్గున్నవారెవరైనా జనసేనలో చేరతారా? అంటూ ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలను జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి మాయ చేస్తున్నారని ఆరోపించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల మాటలు నమ్మి మోసపోవద్దు అని ప్రజలను కోరారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని గుర్తు చేశారు. నాడు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి రూ.5 వేల కోట్లు తీసుకున్నారని కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే 2024 ఎన్నికల అనంతరం బీజేపీలో జనసేనను పవన్ కల్యాణ్ విలీనం చేయడం ఖాయమని అన్నారు. పవన్ కల్యాణ్ చేస్తున్న వారాహి విజయయాత్ర కేవలం బీజేపీ కోసమేనని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగేంద్రబాబులతో చర్చించేందుకు తాను సిద్ధమని కేఏ పాల్ సవాల్ చేశారు.



Next Story

Most Viewed