స్టేట్ గెస్ట్‌గా చిరంజీవి.. ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చంద్రబాబు

by Gantepaka Srikanth |
స్టేట్ గెస్ట్‌గా చిరంజీవి.. ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: తన ప్రమాణస్వీకారానికి రావాలని మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. రాష్ట్ర నుంచి ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని కోరారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులతో పాటు పలువురు సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందజేశారు. కాగా, బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కేసరపల్లి ఐటీ పార్కు ప్రాంగణంలో ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరుకానున్నారు. దీంతో ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ రూట్‌లను సూచించారు. అంబులెన్స్‌, అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనాలకు మాత్రమే అనుమతి ఉండనుంది.

Next Story

Most Viewed