APకి ప్రత్యేక హోదా లేదు.. Polavaramపై కేంద్రం కొత్త మెలిక

by Disha Web Desk 16 |
APకి ప్రత్యేక హోదా లేదు.. Polavaramపై కేంద్రం కొత్త మెలిక
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status) లేదని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రత్యేక పరిస్థితుల్లో గతంలో కొన్ని రాష్ట్రాలకు ఇచ్చామని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొంది. జనరల్ కేటగిరీ, హోదా ఇచ్చిన రాష్ట్రాల మధ్య తేడా చూపలేదని తెలిపింది. 2015-2020 మధ్య పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినట్లు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం 2024 నాటికి పోలవరం పూర్తి కావాలని సూచించింది. ఇప్పటికే పోలవరం నిర్మాణానికి రూ. 13,226.04 కోట్లు చెల్లించామని, ఇంకా చెల్లించాల్సింది 2,441.86 కోట్లు మాత్రమేనని తెలిపింది. వివిధ కారణాల వల్ల గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమేనని కేంద్రం వెల్లడించింది.

కాగా ఏపీ విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఐదేళ్లు కాదని.. పదేళ్లు ఇవ్వాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ప్రకటించింది. కానీ పూర్తి స్థాయి నిధులను విడుదల చేయలేదు. అయితే ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ ఇప్పటికీ ఏపీలో వినిపిస్తూనే ఉంది. ఏపీకి సంబంధించిన ఎంపీలు రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి కూడా గుర్తు చేశారు. దీంతో కేంద్రం స్పష్టత ఇచ్చింది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టింది.

ఇవి కూడా చదవండి :

1.ఏపీలో పెద్ద కుట్ర జరుగుతోంది.. Minister Bosta సంచలన వ్యాఖ్యలు

2.Kidney Rocket: కిడ్నీ అమ్మితే రూ. 7 కోట్లు ఆఫర్.. లింక్ క్లిక్ చేయడంతో...!

Next Story

Most Viewed