Ap Local Elections: కొనసాగుతున్న కౌంటింగ్.. కాసేపట్లో ఫలితాలు

by srinivas |
Ap Local Elections: కొనసాగుతున్న కౌంటింగ్.. కాసేపట్లో ఫలితాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పలు పంచాయతీలు, వార్డులకు ఉపఎన్నికలు జరిగాయి. 34 సర్పంచ్, 245 వార్డు మెంబర్ స్థానాలకు ఉదయం నుంచి 2 గంటల వరకూ పోలింగ్ జరిగింది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. గట్టి నిఘా మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది..

అయితే కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. సత్యసాయి జిల్లా చలివెందులలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంతో కొంత సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ పార్టీకి చెందిన వ్యక్తి డబ్బులు పంచుతుండగా స్థానికులురెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే ఏలూరు జిల్లా వీరమ్మ కుంటలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. పరస్పరం కొట్టుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. ఇక ప్రకాశం జిల్లా పల్లెపాలెంలోనూ ప్రలోభావాల పర్వం కొనసాగింది.

Next Story

Most Viewed