BREAKING: బీసీల డీఎన్‌ఏలోనే టీడీపీ ఉంది: జయహో బీసీ గర్జనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING: బీసీల డీఎన్‌ఏలోనే టీడీపీ ఉంది: జయహో బీసీ గర్జనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీల డీఎన్‌ఏలోనే టీడీపీ ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ మంగళగిరిలో నిర్వహించిన జయహో బీసీ గర్జనలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. జయహో బీసీ అందరి నినాదమని.. అదే విధానం కావాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సూచన మేరకు బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించబోతున్నామని వెల్లడించారు. 40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న ఏకైక పార్టీ టీడీపీయేనని, ప్రస్తుతం ఆ పార్టీకి జనసేన కూడా తోడైందని పేర్కొన్నారు.

తాము అధికారంలోకి రాగానే పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో సబ్‌ప్లాన్ ద్వారా రూ.1.50 వేల కోట్ల మేర బీసీల సంక్షేమానికి ఖర్చు చేస్తామని తెలిపారు. అదేవిధంగా చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతామని అన్నారు. నియంత జగన్ పాలనలో 16,800 మంది బీసీలకు పదవులకు దూరం అయ్యారని ధ్వజమెత్తారు. గడిచిన నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో బీసీల నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. బీసీకకు రిజర్వేషన్లను కూడా తగ్గించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై బీసీలంతా ఏకమై.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

Read More..

జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ కాంత్ పటేల్



Next Story

Most Viewed