ఉత్తరాంధ్రపై పవన్ కల్యాణ్ ఫోకస్ .. రేపు టార్గెట్ చేసేది ఎవరినో?

by Disha Web Desk 21 |
ఉత్తరాంధ్రపై పవన్ కల్యాణ్ ఫోకస్ .. రేపు టార్గెట్ చేసేది ఎవరినో?
X

దిశ, డైనమిక్ బ్యూరో : మూడో విడత వారాహి విజయయాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలుగా వారాహి విజయయాత్రను పవన్ కల్యాణ్ నిర్వహించారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఉభయగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ ఈ వారాహి విజయయాత్రకు శ్రీకారం చుట్టడం.. ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో రెట్టింపు ఉత్సాహంతో మూడో విడత యాత్రకు రెడీ అవుతున్నారు. తొలివిడతలో వైసీపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడిన జనసేనాని రెండో విడతలో వ్యవస్థలపై విరుచుకుపడ్డారు. వలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పటికీ వివాదాస్పదంగానే మారుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 10 నుంచి విశాఖపట్నంలో మూడో విడత యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ విడతలో పవన్ కల్యాణ్ ఎవరిని టార్గెట్ చేస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

కమిటీల నియామకం

ఈ మూడో విడత వారాహి విజయ యాత్రకు సంబంధించి జనసేన పార్టీ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మూడో విడత వారాహి విజయయాత్ర కమిటీల సమన్వయకర్తగా మల్నీడి తిరుమల రావును నియమించింది. జనసేన నేతలు బండి రామకృష్ణ, మధు వీరేశ్, కత్తిపూడి బాబీ, మోకా నాని, రావాడ నాగు, కె.రామారావు, సత్తిబాబు, గల్లా తిమాతి, మేడిద దుర్గాప్రసాద్, సుందరనీడి పట్టాభిరామయ్య, మాగాపు వీర్రాజు, మొండా శివప్రసాద్‌లన క్యాటరింగ్ కమిటీగా నియమించింది. అలాగే ధవళ కీర్తేశ్, విశ్వక్షేన్, యడ్లపల్లి రాంసుందర్, తోరం శశాంక్‌లను ఆపరేషన్ కమిటీగా నియమించింది. ఇకపోతే మెడికల్ అసిస్టెన్స్ కమిటీ సభ్యులుగా రఘు, గౌతమ్ రాజ్, డాక్టర్ లక్ష్మణ్, బి.రవికాంత్, శ్రీమతి వసంత లక్ష్మి, బత్తుల రామకృష్ణలను నియమించింది. ఇకపోతే వలంటీర్ల కమిటీ సభ్యులుగా బోడపాటి శివదత్, చాగంటి మురళీకృష్ణ, కొరియర్ శ్రీనివాస్, పవన్ కుమార్, ఎ.విక్రమ్, శ్రీనివాస పట్నాయక్, సందు పవన్‌లను నియమించింది. ఇకపోతే మీడియా సమన్వయ కమిటీ సభ్యులుగా పీలా రామకృష్ణ, బొలియాశెట్టి శ్రీకాంత్, ఆళ్ల హరి, వి.సతీశ్, వీఎన్ఎస్ చంద్రరావులను నియమిస్తూ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

Next Story

Most Viewed