వివేకా కేసును సీఎం జగన్ ఎటైనా మరల్చవచ్చు.. సజ్జల షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 16 |
వివేకా కేసును సీఎం జగన్ ఎటైనా మరల్చవచ్చు.. సజ్జల షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసుపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ కేసును సీఎం జగన్ ఎటైనా మరల్చవచ్చని ఆయన బాంబు పేల్చారు. ఒక్క జీవోతో సీబీఐని రాకుండా అడ్డుకోవచ్చని, కానీ వైఎస్ సునీత నిర్ణయాన్ని సీఎం జగన్ స్వాగతించారని తెలిపారు. సీబీఐ విచారణను సీఎం జగన్ వ్యతిరేకించలేదన్నారు. వివేకాను ఎవరు హత్య చేశారో ఇప్పటికే ప్రజలు తెలుసని సజ్జల చెప్పారు.

కాగా గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా నందారెడ్డి హత్యకు గురయ్యారు. అయితే ఆ హత్యను అప్పటి టీడీపీ ప్రభుత్వం చేయించిందని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్ అధికారంలోకి వచ్చారు. అయితే కేసులో జాప్యం జరుగుతుందని వివేకా నందారెడ్డి కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించి సీబీఐకు అప్పగించాలని కోరారు. దాంతో కోర్టు అనుమతించించడంతో కేసులో జగన్ సోదరుడు, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఈ మేరకు ఆయన్ను సీబీఐ అధికారులు విచారించారు. అయితే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడం వెనుక జగన్ హస్తం ఉందని ప్రచారం జరిగింది. అంతేకాదు ఈ కేసు నిందితులను జగన్ కాపాడుతున్నారని వైఎస్ సునీత అంటున్నారు. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు చెప్పారు.

Next Story

Most Viewed