45 రోజుల్లో ఎన్నికలు.. నేను చేయాల్సింది మొత్తం చేశా: CM జగన్

by Disha Web Desk 2 |
45 రోజుల్లో ఎన్నికలు.. నేను చేయాల్సింది మొత్తం చేశా: CM జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తో్న్న వేళ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మంగళగిరిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ‘‘45 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్నాయి. దాదాపు టికెట్లు అన్ని ఖరారు అయ్యాయి. మార్చాల్సిన 99 శాతం మార్చేశాం. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 87 శాతం ఇళ్లకు మంచి జరిగింది. ఇంత మంచి, అభివృద్ధి జరిగినప్పుడు ప్రతి గ్రామంలో మెజార్టీ ఎందుకు రాదు. గ్రామంలో వచ్చిన మెజార్టీ మండలంలో ఎందుకు రాదు.

మండలంలో వచ్చిన మెజార్టీ నియోజకవర్గంలో ఎందుకు రాదు. 175 నియోజకవర్గాల్లో మన అభ్యర్థులంతా ఘన విజయం సాధించడం ఎందుకు సాధ్యం కాదు. పేదవాడు బతకాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రావాలి అనే సంకేతం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నేను చేయాల్సింది మొత్తం చేసేశా. దేశంలో ఏ నాయకుడు ఇవ్వని ఆయుధాన్ని నేను మీ చేతుల్లో పెట్టాను. గెలిపించుకొని రావాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలిచి తీరాలి’’ అని సీఎం జగన్ అన్నారు.

Read More..

YSRCP: వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ కీలక పిలుపు



Next Story

Most Viewed