AP: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. నెలకు రూ.50వేలు సంపాదించే మార్గం చూపిస్తానని హామీ

by Disha Web Desk 1 |
AP: వాలంటీర్ల వ్యవస్థపై  చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. నెలకు రూ.50వేలు సంపాదించే మార్గం చూపిస్తానని హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల నేపథ్యంలో ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. ఆసరా పెన్షన్లు, సంక్షేమ పథకాలకు, పెన్షనర్లకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయించకూడదంటూ సీఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు వాలంటీర్లను పక్కన పెట్టాలని ఈసీ ప్రభుత్వానికి సూచించింది. ఈ పరిణామంతో పెన్షన్ల రగడ రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

వాలంటీర్ల వ్యవస్థకు తాను ఏమాత్రం వ్యతిరేకం కాదని, సోషల్ మీడియాతో తమ పార్టీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా వాలంటీర్లు రాజకీయం చేస్తే తాను అందుకు వ్యతిరేకమంటూ కామెంట్ చేశారు. వాలంటీర్లలో కూడా చాలా ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారని, వాళ్లందరికీ నెలకు రూ.50 వేలు సంపాదించే మార్గం తాను చూపిస్తానని భరోసానిచ్చారు. ఎన్నికలు అయ్యేంత వరకు వాలంటీర్లు తటస్థంగా ఉండాలని మాత్రమే తాను చెప్పానని చంద్రబాబు అన్నారు.

Read More..

బాబు మీ ఖాతాలో రూపాయి అయినా వేశారా?: సీఎం జగన్

Next Story

Most Viewed