Weather Report: వేడెక్కిన తెలుగు రాష్ట్రాలు.. ఆ ప్రాంతాల్లో నేడు, రేపు వడగాలులు

by Disha Web Desk 3 |
Weather Report: వేడెక్కిన తెలుగు రాష్ట్రాలు.. ఆ ప్రాంతాల్లో నేడు, రేపు వడగాలులు
X

దిశ వెబ్ డెస్క్: వేసవికాలం ప్రారంభం అయ్యింది. దీనితో సూర్యుడు భగ్గుమంటున్నాడు. అటు తెలంగాణా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే చాలు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని 50 మండలాల్లో నేడు రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

నిన్న ఆంధ్రాలోని 31మండలాల్లో వడగాలులు వీచాయి. ఇక కడప జిల్లాలోని ముద్దనూరులో తీవ్ర వడగాలులు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా శుక్రవారం ఆంధ్రాలో ఎండ తీవ్రత 40 డిగ్రీలు నమోదు కాగా.. నేడు మరో రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.


Next Story