- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆంజనేయస్వామి రథోత్సవంలో అపశృతి.. ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలు

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం ఆంజనేయస్వామి ఆలయ రథోత్సవ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మహా ఘట్టాన్ని తలికించేందుకు భారీ సంఖ్యలో భక్తులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. శనివారం రాత్రి రథం లాగుతుండగా కుప్పకూలింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భక్తులు ఒక్కసారిగా అరుపులు, కేకలతో పరుగులు తీశారు. ఈ ఘటన కుందుర్పి మండలం అపిలేపల్లిలో చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులకు గాయాలు అయ్యాయి. కాగా, ఆంజనేయస్వామి రథం కూలడాన్ని అక్కడి ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలా జరుగలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రథం కుప్పకూలిన విషయం తెలసిన పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. గాయపడిన భక్తులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.