క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: Pawan Kalyan

by Disha Web Desk 6 |
క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: Pawan Kalyan
X

దిశ, డైనమిక్ బ్యూరో : మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోరారు. జనసేన పార్టీకి కార్యకర్తలే బలం. వారే మా సంపద, రెండు విడతలుగా విజయవంతం అయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ మూడో విడతగా ఈ నెల 10న మొదలై 28 వరకు సాగుతుందని తెలిపారు. గత రెండు విడతల్లోనూ పార్టీ క్రియాశీలక సభ్యులను చేర్చడం కోసం ఎంతో కష్టపడి పనిచేసిన సుమారు 6,400 మంది పార్టీ వాలంటీర్లకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.

పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, ప్రమాద బీమా నమోదు నిమిత్తం తన వంతుగా రెండు విడతల్లోనూ రూ.2 కోట్లు విరాళం ఇచ్చిన విషయాన్ని తెలియజేశారు. మూడో విడతలోనూ తనవంతుగా కార్యకర్తల బీమా కోసం ఈ నెల 10న తన వంతు విరాళం అందిస్తానని ప్రకటించారు. మూడో విడతలోనూ బలమైన స్ఫూర్తితో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమష్టిగా ముందుకు తీసుకువెళ్లి, విజయవంతం చేయాలని పవన్ కల్యాణ్ కోరారు.Next Story

Most Viewed