ముహూర్తం బాబు డిసైడ్‌ చేస్తారు.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైసీపీకి అదిరే ట్విస్ట్

by Disha Web Desk 14 |
ముహూర్తం బాబు డిసైడ్‌ చేస్తారు.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైసీపీకి అదిరే ట్విస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, పలు కారణాలతో కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు టీడీపీలో చేరనున్నారు. తన కొడుకు మాగుంట రాఘవరెడ్డికి వైసీపీ టికెట్ లేదని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పడంతో మాగుంట కుటుంబం వైసీపీ పార్టీని వీడింది. అనంతరం టీడీపీలో చేరే విషయంపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడుతున్న మాగుంట త్వరలోనే ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ మాగుంట తన నివాసంలో టీడీపీ నేతలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ముత్తుముల అశోక్ రెడ్డి, బీఎన్ విజయకుమార్, కందుల నారాయణరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు కలిశారు. ఒంగోలు టీడీపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్న మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

టీడీపీలో చేరుతున్నాం..

ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ.. చంద్రబాబు మా కుటుంబాన్ని టీడీపీలోకి ఆహ్వానించారని తెలిపారు. టీడీపీలో చేరేందుకు మేం సిద్ధంగా ఉన్నామని, టీడీపీలో ఎప్పుడు, ఎక్కడ చేరాలనేది చంద్రబాబు నిర్ణయిస్తారని స్పష్టంచేశారు. ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరామని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. నాకు రిటైర్మెంట్ వయస్సు వచ్చింది కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో తన కొడుకు మాగుంట రాఘవ పోటీ చేస్తాడని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మాగుంట తేల్చి చెప్పారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తన కుమారుడు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఏపీలో కూటమి విజయానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ట్విస్ట్

మాగుంట కుటుంబం వైసీపీ పార్టీని వీడడంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒంగోలులో దాదాపు 33 ఏళ్లుగా రాజకీయాల్లో మాగుంట కుటుంబం ఉంది. వారి కుటుంబ సభ్యులు 8 సార్లు పార్లమెంటుకు, రెండు సార్లు అసెంబ్లీకి, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. నేడు వారంతా టీడీపీ పార్టీలో చేరనున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి టఫ్ ఫైట్ ఉండబోతోందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.


Read More..

నిన్న పవన్.. ఈ రోజు చంద్రబాబుతో చర్చలు.. పొత్తులపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు



Next Story

Most Viewed