రెండేళ్ల తర్వాత చైనాను దాటనున్న Xi Jinping to Meet Vladimir Putin

బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండేళ్ల తర్వాత తొలిసారిగా దేశం దాటనున్నారు.Latest Telugu News

Update: 2022-09-11 15:09 GMT

బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండేళ్ల తర్వాత తొలిసారిగా దేశం దాటనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసేందుకు బుధవారం కజకిస్తాన్ పర్యటనకు వెళ్లనున్నారు. పుతిన్‌తో సమావేశమవ్వడమే కాకుండా షాంఘై సదస్సులోనూ ఆయన పాల్గొననున్నారు. కరోనా మహమ్మారి వచ్చాక జిన్‌పింగ్ చేస్తున్న విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. ఇరు దేశాలకు యూఎస్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దేశాధినేతల సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశం ద్వారా చైనా అధ్యక్షుడు తన సామర్థ్యాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాను శిక్షించాలని చూస్తున్నట్లే ఇరువురు నాయకులూ యునైటెడ్ స్టేట్స్ పట్ల తమ వ్యతిరేకతను చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా కీలక నేత తైవాన్ పర్యటన పట్ల డ్రాగన్ దేశం ఆగ్రహాంగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు యూకే రాజుగా నియమితులైన కింగ్ ఛార్లెస్‌కు జిన్‌పింగ్ అభినందనలు తెలుపుతూ సందేశం పంపారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసేందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యే విషయమై ఎలాంటి స్పష్టత లేదు.

Tags:    

Similar News