యూఎస్ క్యాపిటల్ భవనంలో కాల్పులు

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ గెలుపును ధృవీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశమైంది. కాగా, జోబైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారుల ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు టియర్ […]

Update: 2021-01-06 20:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ గెలుపును ధృవీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశమైంది. కాగా, జోబైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారుల ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘర్షణ వాతావరణంతో బైడెన్ గెలుపు ధృవీకరణ ప్రక్రియకు ఆటంకం కలిగింది. ట్రంప్ ఆదేశాలతో
కేంద్ర బలగాలను రంగంలోకి దింపినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఆందోళనకారులు శాంతియుతంగా వ్యవహరించాలంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. తన మద్దతుదారులు పోలీసులకు సహకరించాలని ట్రంప్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News