ఇలా ఆదేశాలు.. అలా ఉత్తర్వులు.. చకచకా అయిపోయిందిగా...!

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ బదిలీ చకచకా జరిగిపోయింది. ...

Update: 2024-05-05 16:10 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ బదిలీ చకచకా జరిగిపోయింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలు వచ్చిన వెంటనే రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి యాక్షన్ తీసుకున్నారు. రాజేంద్రనాథ్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు తర్వాత స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగిస్తూ జీవో నెంబర్ 850ను విడుదల చేశారు.

కాగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్రంలో నెలకొంటున్న శాంతి భద్రతల సమస్యలతో ఆయన్ను బదిలీ చేసింది. వైసీపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌ను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Tags:    

Similar News