భూములు మావి... ఫొటోలు మీవా?.. జగన్‌ను నిలదీసిన చంద్రబాబు

‘భూములు మావి.. ఫొటోలు మీవా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు....

Update: 2024-05-05 15:42 GMT

దిశ, వెబ్ డెస్క్: ‘భూమి మీది.. ఫొటో జగన్‌దా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రైతు పట్టాదారు పుస్తకాలపై జగన్ ఫొటోలు ఉండటంపై విమర్శలు కురింపించారు. అనంతపురంలో ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం జగన్ బటన్ నొక్కేది ఎంతని.. దోచుకునేది ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులపై జగన్ కన్ను పడిందని, అందుకే వాటిపై ఫొటోలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. చివరకు తన భూమికి కూడా జగన్ ఫొటో పెట్టుకోవాలా అని ప్రశ్నించారు. సీమ బిడ్డను అని చెప్పుకునే జగన్ ఈ ప్రాంతానికి ఏమైనా చేశాడా అని వ్యాఖ్యానించారు. 59 నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేకపోయాడని ఎద్దేవా చేశారు. దీపం పథకాన్ని తాను తీసుకొస్తే.. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఆర్పేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపలు ఇవ్వడమే కాదని...వాటి పట్టుకునే విధానాన్ని కూడా నేర్పాలని సూచించారు. అనంతపురానికి కంపెనీలు తీసుకొచ్చి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. తెలుగు భాషను నాశనం చేస్తున్నారని కేంద్రహోంమంత్రి అమిత్ షా చెప్పారని, రాష్ట్రాన్ని సైకో పాలిస్తే ఇలానే ఉంటుందన్నారు. సైకోలను ప్రశ్నిస్తే ఇంటికి గొడ్డలి పంపుతారని ఎద్దేవా చేశారు. బాధితులనే నిందితులుగా నిందితులను బాధితులుగా మార్చేస్తారని చంద్రబాబు మండిపడ్డారు. 

Similar News