కరోనా నివారణ ఏం చర్యలు తీసుకున్నారు..?

దిశ, హైదరాబాద్ కరోనా వైరస్ అడ్డుకట్ట వేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారని మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖను వివరణ కోరింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పై పత్రికలు, మీడియాలో వస్తున్న కథనాలపై హెచ్ ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ మేరకు నాంపల్లి కమిషన్ కార్యాలయంలో శనివారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]

Update: 2020-03-07 09:43 GMT

దిశ, హైదరాబాద్
కరోనా వైరస్ అడ్డుకట్ట వేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారని మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖను వివరణ కోరింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పై పత్రికలు, మీడియాలో వస్తున్న కథనాలపై హెచ్ ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ మేరకు నాంపల్లి కమిషన్ కార్యాలయంలో శనివారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ ముందు తెలంగాణ డీఎంఈ రమేష్ రెడ్డి, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రి సుపురింటెండెంట్ లు హాజరయ్యారు. తెలంగాణా రాష్ట్రంలో వ్యాధి విస్తరించాకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు డీఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ప్రరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ముందస్తుగా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు.

tags;what action to prevent coronavirus,HRC explanation, hyderabad

Tags:    

Similar News