గ్రేటర్‌లో 100 సీట్లు గెలుస్తాం !

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100సీట్లు గెలిచి, మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ చేపట్టిన సర్వేలో నగర ప్రజలందరూ బీజేపీని గెలిపించేందుకు ఉత్సాహంగా ఉన్నారని తేలినట్టు వెల్లడించారు. ప్రజలను మోసం చేసే పగటి మోసగాళ్ళను గ్రేటర్ ప్రజలు తరిమి కొట్టాలనే కసితో ఉన్నారని, మెరుగైన సేవలను అందించే, నీతి వంతమైన పాలనను చేసే బీజేపీ వైపే ప్రజలు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ లో నాలాలను […]

Update: 2020-11-11 08:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100సీట్లు గెలిచి, మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ చేపట్టిన సర్వేలో నగర ప్రజలందరూ బీజేపీని గెలిపించేందుకు ఉత్సాహంగా ఉన్నారని తేలినట్టు వెల్లడించారు. ప్రజలను మోసం చేసే పగటి మోసగాళ్ళను గ్రేటర్ ప్రజలు తరిమి కొట్టాలనే కసితో ఉన్నారని, మెరుగైన సేవలను అందించే, నీతి వంతమైన పాలనను చేసే బీజేపీ వైపే ప్రజలు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ లో నాలాలను కబ్జాచేసిందెవరు..? నగరంలో వరదలకు బాధ్యులెవరని, అందుకు తీసుకున్న చర్యలేవి..? అని సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

ప్రజలను బెదిరించడం, కుట్రలు చేయడం మానుకోవాలని, ప్రజాస్వామ్యబద్దంగా పాలన సాగించాలనేది గ్రేటర్ ఓటర్లు కోరుకుంటున్నారని చెప్పారు. సేవా దృక్పథంతో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని గ్రేటర్ ప్రజలు బలపరిచేందుకు సిద్దమవుతున్నారని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. నిజామాబాద్‌లో కవితను ఓడగొట్టామని, నీ కొడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల ఉండే పార్లమెంట్ నియోజకవర్గంలో నేను గెలిచి వచ్చాననేది గుర్తుపెట్టుకోవాలని, ప్రజలు మీకు తగిన రీతిలో బుద్దిచెప్పుతారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి అడుగులకు మడుగులు వత్తుతుందని ఆరోపించారు.

Tags:    

Similar News