కరోనాపై వినూత్నరీతిలో ప్రజలకు అవగాహన 

దిశ, మహబూబ్ నగర్: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. దీంతో ప్రజలకు అర్థమయ్యేలా వనపర్తి పట్టణ పోలీసులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సోమవారం ఉదయం వనపర్తి సీఐ సూర్యనాయక్, పట్టణ ఎస్సై వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో గబ్బిలం ఆకారంతోపాటు, కరోనా వైరస్ ఆకారంలో హెల్మెట్‌తో ప్రజలకు అవగాహన కలిపించారు. జిల్లాల్లో రోజువారీగా కేసులు పెరుగుతుండటం, అయినా ప్రజల్లో ఏ మార్పు రాకపోవడం విచారకరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు […]

Update: 2020-04-13 08:01 GMT

దిశ, మహబూబ్ నగర్: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. దీంతో ప్రజలకు అర్థమయ్యేలా వనపర్తి పట్టణ పోలీసులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సోమవారం ఉదయం వనపర్తి సీఐ సూర్యనాయక్, పట్టణ ఎస్సై వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో గబ్బిలం ఆకారంతోపాటు, కరోనా వైరస్ ఆకారంలో హెల్మెట్‌తో ప్రజలకు అవగాహన కలిపించారు. జిల్లాల్లో రోజువారీగా కేసులు పెరుగుతుండటం, అయినా ప్రజల్లో ఏ మార్పు రాకపోవడం విచారకరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకుని స్వీయ నియంత్రణ పాటించడమే కాకుండా పోలీసులకు సహకరించాలని సీఐ అన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, వేషధారణ కళాకారులు పాల్గొన్నారు.

tags: corona, lockdown, diff manner of explanation, how corona danger

Tags:    

Similar News