హైదరాబాద్‌ వర్షాలపై CM రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం రాత్రి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Update: 2024-05-07 17:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం రాత్రి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్, ట్రాఫిక్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైన ప్రదేశాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. జీహెచ్‌‌ఎంసీ, ముగ్గురు పోలీస్ కమిషనర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపుల‌తో భారీవర్షం కురిసింది. దీంతో పలుచోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హైదరాబాద్‌లో అక్కడక్కడ చెట్లు విరిగి రోడ్లపై పడి ట్రాఫిక్‌కు, విద్యుత్ వైర్లు తెగిపడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారీగా వరదనీరు రోడ్లపైకి చేరడంతో నగరవాసులు ఇబ్బంది పడ్డారు.

Also Read...

బీజేపీ, బీఆర్ఎస్‌లు రైతుల నోట్లో మట్టి కొట్టాయి: మంత్రి కోమటిరెడ్డి 

Tags:    

Similar News