లేడీ బ్రూస్‌లీ! భర్త‌పై వైన్స్ సిబ్బంది దాడి చేశారని రెచ్చిపోయిన భార్య

ఏ భార్య అయిన తన భర్తపై ఇతరులు దాడి చేసినప్పుడు దాడి చేసిన వారిపై లేడీ సింగం అయి పంజా విసురుతుంది.

Update: 2024-05-19 12:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఏ భార్య అయిన తన భర్తపై ఇతరులు దాడి చేసినప్పుడు దాడి చేసిన వారిపై లేడీ సింగం అయి పంజా విసురుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఓ వ్యక్తి మద్యం కొనేందుకు వైన్ షాప్‌కి వెళ్లగా.. పేమెంట్ విషయంలో మాట మాట పెరగడంతో వైన్ షాప్ సిబ్బంది వ్యక్తిపై దాడి చేశారు. గొడవ అనంతరం ఇంటికొచ్చిన తర్వాత అతని వాలకం చూసిన భార్య ఆరా తీసింది.

వైన్‌షాప్ సిబ్బంది దాడి చేశారని భర్త చెప్పడంతో.. భార్య వైన్‌షాప్‌కి వెళ్లి.. సిబ్బందితో గొడవకు దిగిందని, అదే సమయంలో అడ్డొచ్చిన పోలీసులతో కూడా వాగ్వాదం చేసిందని వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలోనే వైన్ షాప్ సిబ్బందితో పాటు, మహిళ మీద వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. దీనికి సబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో లేడీ బ్రూస్‌లీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Click here for twitter video 

Tags:    

Similar News