నయవంచన చేయడంలో కేసీఆర్ నెంబర్‌వన్ : విజయశాంతి

దిశ, తెలంగాణ బ్యూరో : బూటకపు కబుర్లతో ప్రజలను నయవంచన చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ అనిపించుకున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మండి పడ్డారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌పై తనదైన శైలీలో విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం వింటే అరచేతిలో వైకుంఠం చూపించడమంటే ఏమిటో అర్థమవుతుందన్నారు. దళిత బంధు పథకం గురించి కేసీఆర్ మాట్లాడుతూ.. రకరకాల గణాంకాలు, బడ్జెట్ కేటాయింపులంటూ అంకెల గారడీ చేశారని ఆరోపించారు. తెలంగాణలోని […]

Update: 2021-08-16 11:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బూటకపు కబుర్లతో ప్రజలను నయవంచన చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ అనిపించుకున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మండి పడ్డారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌పై తనదైన శైలీలో విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం వింటే అరచేతిలో వైకుంఠం చూపించడమంటే ఏమిటో అర్థమవుతుందన్నారు.

దళిత బంధు పథకం గురించి కేసీఆర్ మాట్లాడుతూ.. రకరకాల గణాంకాలు, బడ్జెట్ కేటాయింపులంటూ అంకెల గారడీ చేశారని ఆరోపించారు. తెలంగాణలోని దళితుల సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం ఈ పథకమే అన్నట్టుగా చెప్పుకొచ్చారని, గతంలో ఆయన దళిత సీఎం, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలిచ్చినప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారని, ఆ తర్వాత దళిత ఉప ముఖ్యమంత్రులిద్దరినీ పక్కకు నెట్టేసి దళితులకు ఆయన ఇచ్చిన గౌరవం ఏమిటో కళ్లారా చూశామని, ఆరంభ శూరత్వం తప్ప మరొకటి తెలియని కేసీఆర్ నైజం అందరికీ తెలిసిందేనని దుయ్యబట్టారు.

కేసీఆర్ ప్రసంగంలోని మిగతా అంశాల్ని గమనిస్తే.. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉందని, తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించిందని, పరిస్థితులు ఇంత గొప్పగా ఉన్నప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతులకు సమస్యలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. హరితహారంతో పచ్చదనం పెరిగిందన్న కేసీఆర్.. ఈ పథకం కోసం సొంత డబ్బులు ఖర్చు చేసి అప్పుల పాలైనవారి గురించి తెలియదా? అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని సర్కారు అంత గొప్పగా అభివృద్ధి చేసి ఉంటే.. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎందుకు నిరసన జ్వాలలు ఎదుర్కోవలసి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News