TS SSC Results: రేపు ఉదయం 11 గంటలకు టెన్త్‌ రిజల్ట్స్‌..

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.

Update: 2024-04-29 05:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ఏప్రిల్ 13 నాటికే పూర్తి చేశారు. దీంతో పదో తరగతి ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ నెల 30న (మంగళవారం) ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://results.bsetelangana.org/ చూసుకోవచ్చు.

Tags:    

Similar News