విజయసాయి వ్యాఖ్యలు.. ఉపరాష్ట్రపతి తీవ్ర మనస్తాపం !

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిష్పాక్షికతపై చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర మనస్తాపం చెందారు. టీడీపీ ఎంపీ వ్యాఖ్యలపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన విజయసాయిరెడ్డి.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా.. లిఖిత పూర్వక వివరాలు ఇస్తేనే పరిశీలిస్తానని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. దీంతో సంతృప్తి చెందని ఎంపీ విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిష్పాక్షికతను ప్రశ్నించారు. ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లవని తెలిపారు. […]

Update: 2021-02-08 07:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిష్పాక్షికతపై చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర మనస్తాపం చెందారు. టీడీపీ ఎంపీ వ్యాఖ్యలపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన విజయసాయిరెడ్డి.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా.. లిఖిత పూర్వక వివరాలు ఇస్తేనే పరిశీలిస్తానని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. దీంతో సంతృప్తి చెందని ఎంపీ విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిష్పాక్షికతను ప్రశ్నించారు. ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లవని తెలిపారు. ఇదే క్రమంలో విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ కోరగా… ఆయనతో ఇతర సభ్యులు గళం వినిపించారు.

అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నా నిష్పాక్షికతను ప్రశించడం ఎంతో బాధించిందని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. నేను పనిచేయకుండా ఉండేందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని, ఎన్ని విమర్శలు చేసినా నా విధులు నేను నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ముందే బీజేపీకి రాజీనామా చేశానన్న వెంకయ్య నాయుడు.. రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని గుర్తు చేశారు. నా హృదయం దేశ ప్రజలతో మమేక మైందని, ఎవరు ఎమన్నా పట్టించుకోనని వివరించారు.

Tags:    

Similar News