చంద్రబాబు CM ప్రమాణ స్వీకారోత్సవ వేడుకకు ప్లేస్ ఫిక్స్.. వెల్లడించిన బుద్ధా..!

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగియడంతో ఇక ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్‌లో

Update: 2024-05-15 12:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగియడంతో ఇక ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్‌లో జోరుగా చర్చ మొదలైంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ఏ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుంది..? ఏపీ నెక్ట్స్ సీఎం ఎవరూ అవుతారు..? అనే అంశాలు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మరో అడుగు ముందుకేసి చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయమని చెప్పడంతో పాటు ప్రమాణ స్వీకారం చేసే వేదిక కూడా ఎక్కడో కూడా చెప్పేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.

అమరావతిలోనే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన ఓటింగ్ శాతం చూస్తేనే టీడీపీ విజయం ఖాయమని విషయం అర్థమైపోతుందన్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాష్ట్రంలో పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత కారణంగానే ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని ఓటుతో వారి కసి తీర్చుకున్నారన్నారు. జగన్ ఇంటికి పంపేందుకు ఓటర్లు కంకణం కట్టుకున్నారని, జూన్ 4 తర్వాత జగన్ తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయమని అన్నారు. 

Similar News