ప్రజల సొమ్ము తినేస్తోన్న ఉపాధి సిబ్బంది.. కన్నెత్తి చూడని అధికారులు!

ఎర్రగొండపాలెం మండలంలో ఉపాధి పనులు జోరుగా జరుగుతున్నాయి

Update: 2024-05-15 14:29 GMT

దిశ,ఎర్రగొండపాలెం:ఎర్రగొండపాలెం మండలంలో ఉపాధి పనులు జోరుగా జరుగుతున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు వలస వెళ్లిన వారి వద్ద 200, 300, 400 చెరి సగం చొప్పున డీల్ మాట్లాడడం తద్వారా వచ్చే ఆదాయాన్ని టెక్నికల్ అసిస్టెంట్లు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎపిఓ వాటాలుగా పంచుకుంటున్నారు. పనులు చేయకుండానే చేసినట్టుగా గత సంవత్సరం చేసిన పనులను తప్పుడు కొలతలు వేసి కొత్తగా చేసినట్లు చూపిస్తూ ప్రజల సొమ్మును దిగమింగుతున్నారు. ఎర్రగొండపాలెం ఏపీవో దృష్టికి ఎన్నిసార్లు సమస్యలు ప్రజలు విన్నవించుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవు . అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ అధికారులు తీరు మారదు. మండలం లో జరుగుతున్న ఉపాధి హామీ అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి అక్రమానికి అలవాటు పడ్డ అవినీతి అధికారులపై చర్యలు తీసుకొని వారిని విధుల నుంచి తొలగించాలని మండలంలోని ప్రజలు కోరుతున్నారు.

Similar News