వైఎస్సార్సీపీకి వర్ల ఓపెన్ ఛాలెంజ్

వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు స్థానం దక్కించుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ సీటుపై టీడీపీ నేత వర్ల రామయ్య ఆ పార్టీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. నత్వానీని తీసేసి వైఎస్సార్సీపీ ఒక దళితుడ్ని పోటీకి దింపితే తాను పోటీ నుంచి వైదొలగుతానని ఆఫర్ ఇచ్చారు. దీనికి తన పార్టీని ఒప్పిస్తానని ఆయన చెప్పారు. లేని పక్షంలో వైఎస్సార్సీపీ నేతలు తనకు ఓటేయాలని ఆయన సూచించారు. ఈ విషయంలో జగన్‌ను […]

Update: 2020-03-11 05:31 GMT

వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు స్థానం దక్కించుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ సీటుపై టీడీపీ నేత వర్ల రామయ్య ఆ పార్టీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. నత్వానీని తీసేసి వైఎస్సార్సీపీ ఒక దళితుడ్ని పోటీకి దింపితే తాను పోటీ నుంచి వైదొలగుతానని ఆఫర్ ఇచ్చారు. దీనికి తన పార్టీని ఒప్పిస్తానని ఆయన చెప్పారు. లేని పక్షంలో వైఎస్సార్సీపీ నేతలు తనకు ఓటేయాలని ఆయన సూచించారు. ఈ విషయంలో జగన్‌ను ఒప్పించే బాధ్యత ఆపార్టీలోని దళిత నేతలదేనని ఆయన చెప్పారు. అంబేద్కర్ వాణి పార్లమెంటులో వినపడాలంటే తానొక్కడినే పోటీలో ఉన్నానని ఆయన చెప్పారు. 13వ తేదీలోపు దీనిపై వైఎస్సార్సీపీ నేతలు నిర్ణయం తీసుకోవచ్చని ఆయన సమయమిచ్చారు.

Tags: tdp, ysrcp, varla ramaiah, ap, rajya sabha, parimal nathwani, open challenge

Tags:    

Similar News