వరవరరావు డిశ్చార్జి.. తిరిగి జైలుకు

దిశ, వెబ్‌డెస్క్: విరసం నేత వరవరరావు నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆయనను తిరిగి తలోజా జైలుకు తరలించారు. ఇటీవల జైలులోనే కరోనా బారిన పడిన వరవరరావు ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు. మహారాష్ట్రలో జరిగిన భీమా కోరెగావ్‌ అల్లర్లు, మావోయిస్టులతో కుమ్మక్కై ప్రధాని మోదీ హత్యకు కుట్రలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో వరవరరావు 2018లో పూణే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో […]

Update: 2020-08-27 11:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: విరసం నేత వరవరరావు నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆయనను తిరిగి తలోజా జైలుకు తరలించారు. ఇటీవల జైలులోనే కరోనా బారిన పడిన వరవరరావు ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు.

మహారాష్ట్రలో జరిగిన భీమా కోరెగావ్‌ అల్లర్లు, మావోయిస్టులతో కుమ్మక్కై ప్రధాని మోదీ హత్యకు కుట్రలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో వరవరరావు 2018లో పూణే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలాఖా, సుధా భరద్వాజ్‌లు కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Tags:    

Similar News