యూత్‌ను ఆకట్టుకునేలా ‘ఉప్పెన’ టీజర్‌

దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, మంగళూరు బ్యూటీ కృతిశెట్టిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్న చిత్రం ‘ఉప్పెన’. విడుదలకు ముందే ‘నా కన్ను నీలి సముద్రం’, ‘రంగులద్దుకున్న తెల్ల రంగులోనా’, ‘ధక్ ధక్ ధక్’ పాటలతో కుర్రకారును ‘ఉప్పెన’లో ముంచెత్తగా.. తాజాగా వచ్చిన టీజర్ పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి ప్రేమకథను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన టీజర్ ఆద్యంతం యూత్‌ను ఆకట్టుకునేలా రూపొందించడం విశేషం. ‘దేవుడే వరాలిస్తాడ‌ని […]

Update: 2021-01-13 08:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, మంగళూరు బ్యూటీ కృతిశెట్టిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్న చిత్రం ‘ఉప్పెన’. విడుదలకు ముందే ‘నా కన్ను నీలి సముద్రం’, ‘రంగులద్దుకున్న తెల్ల రంగులోనా’, ‘ధక్ ధక్ ధక్’ పాటలతో కుర్రకారును ‘ఉప్పెన’లో ముంచెత్తగా.. తాజాగా వచ్చిన టీజర్ పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి ప్రేమకథను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన టీజర్ ఆద్యంతం యూత్‌ను ఆకట్టుకునేలా రూపొందించడం విశేషం.

‘దేవుడే వరాలిస్తాడ‌ని నాక‌ర్థమైంది, ఎవ‌రికి పుట్టామో అంద‌రికీ తెలుస్తుంది, కానీ ఎవ‌రి కోసం పుట్టానో నా చిన్నప్పుడే తెలిసిపోయింది’ అంటూ హీరో వైష్ణవ్‌ తేజ్ చెబుతున్న డైలాగ్‌తో టీజర్ మొదలు కాగా, ‘వీడు ముసలోడు అవ్వకూడదే’ అంటూ కృతి క్యూట్‌గా పలికిన సంభాషణ టీజర్‌కు ప్రత్యేకంగా నిలిచింది. సముద్ర తీరంలో ‘లవ్ యూ ఐ’ అని రాసిన హీరోయిన్.. ‘మనిద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని పక్కన పెట్టేశాను, ఈ ఒక్కరాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దాం’ అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్‌లు అందరి హృదయాలను హత్తుకున్నాయి. అయితే టీజర్ చివరలో వైష్ణవ్ తేజ్ తీవ్రంగా దెబ్బలు తిని, రక్తం కారుతున్న దేహంతో సముద్ర తీరాన జీవశ్చవంలా పడి ఉండటం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా పరువు హత్యల నేపథ్యంలో వస్తుందని ఇప్పటికే వార్తలు రాగా, టీజర్ చూస్తుంటే అదే నిజమని తెలుస్తోంది. అయితే టీజర్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని చూపించకపోవడం ఫ్యాన్స్ కాస్త డిజాప్పాయింట్ చేసింది. కాగా సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక దేవీ శ్రీ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ కాగా, బుచ్చిబాబు అందించిన సంభాషణలు సినిమాకు మరో హైలెట్.

Tags:    

Similar News