పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్‌కు యూనివర్శల్ యాక్సెస్

దిశ, తెలంగాణ బ్యూరో: ఉన్నత విద్యానభ్యసించే ఎస్సీ విద్యార్థులకు అందించే పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించిన మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ప్రపంచంలోని ఎక్కడి నుంచైన స్కాలర్ షిప్స్ పొందే పథకాన్ని పూర్తిగా పునరుద్ధరించింది. శుక్రవారం ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ నిధులపై సామాజిక న్యాయ, సాధికార మంత్రి రతన్ లాల్ రివ్యూ చేసి రూ.4వేల కోట్లను విడుదల చేశారు. రాబోయే ఐదు సంవత్సరాల […]

Update: 2021-04-09 11:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉన్నత విద్యానభ్యసించే ఎస్సీ విద్యార్థులకు అందించే పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించిన మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ప్రపంచంలోని ఎక్కడి నుంచైన స్కాలర్ షిప్స్ పొందే పథకాన్ని పూర్తిగా పునరుద్ధరించింది. శుక్రవారం ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ నిధులపై సామాజిక న్యాయ, సాధికార మంత్రి రతన్ లాల్ రివ్యూ చేసి రూ.4వేల కోట్లను విడుదల చేశారు.

రాబోయే ఐదు సంవత్సరాల పాటు రూ.35,534కోట్లను ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల కోసం న్యాయ,సాధికార మంత్రిత్వ శాఖ కేటాయించింది. కేంద్రం కేటాయించిన నిధులకు రాష్ట్రాలు తన వాటాను అందజేయాల్సి ఉంటుందని తెలిపింది. స్కాలర్ షిప్స్ లో కేంద్రం 60 వాటాను శాతం భరిస్తే రాష్ట్రం 40 శాతం భరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఈ రేషియో 90:10గా ఉంటుందని తెలిపింది. తొలి విడుతగా యూపీకి రూ.896.32 కోట్లు,మహారాష్ట్రకు రూ.558 కోట్లు,ఏపీకి రూ.450 కోట్ల చొప్పున కేటాయించింది.

Tags:    

Similar News