భారత జీడీపీ వృద్ధి అంచనాలను పెంచిన ఐక్యరాజ్యసమితి!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా కరోనా సెకెండ్ వేవ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రేటింగ్ సంస్థలన్నీ భారత జీడీపీ వృద్ధి అంచనాను తగ్గిస్తున్నాయి. అయితే, అనూహ్యంగా ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో భారత వృద్ధి రేటును పెంచడం విశేషం. 2021 ఏడాదికి గానూ దేశ జీడీపీని 7.5 శాతంగా నమోదవుతుందని, ఇదివరకు జనవరిలో ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన దానికంటే 0.2 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇదే సమయంలో భారత ఆర్థికవ్యవస్థ పరిస్థితి బలహీనంగా ఉన్నట్టు అభిప్రాయపడింది. […]

Update: 2021-05-12 11:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా కరోనా సెకెండ్ వేవ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రేటింగ్ సంస్థలన్నీ భారత జీడీపీ వృద్ధి అంచనాను తగ్గిస్తున్నాయి. అయితే, అనూహ్యంగా ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో భారత వృద్ధి రేటును పెంచడం విశేషం. 2021 ఏడాదికి గానూ దేశ జీడీపీని 7.5 శాతంగా నమోదవుతుందని, ఇదివరకు జనవరిలో ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన దానికంటే 0.2 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

ఇదే సమయంలో భారత ఆర్థికవ్యవస్థ పరిస్థితి బలహీనంగా ఉన్నట్టు అభిప్రాయపడింది. అదేవిధంగా 2022 ఏడాదిలో దేశ జీడీపీ వృద్ధి 10.1 శాతంగా ఉండొచ్చని నివేదిక తెలిపింది. కరోనా సెకెండ్ వేవ్ ప్రభావంతో ఆర్థికవ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ భారీగా డిమాండ్ స్థాయిలో సరిపోవడంలేదని పేర్కొంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దేశ పరిస్థితి బలహీనంగా మారినట్టు తెలిపింది.

Tags:    

Similar News