భారీ తగ్గింపులు, డిస్కౌంట్లకు రెడీగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. సమ్మర్ సేల్ తేదీలు ఇవే
చాలా కాలం తర్వాత మరోసారి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ భారీ డిస్కౌంట్లు, తగ్గింపులతో 2024 గ్రేట్ సమ్మర్ సేల్కు సిద్ధమైంది.
దిశ, బిజినెస్ బ్యూరో: చాలా కాలం తర్వాత మరోసారి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ భారీ డిస్కౌంట్లు, తగ్గింపులతో 2024 గ్రేట్ సమ్మర్ సేల్కు సిద్ధమైంది. ఇది మే 2 మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రం ఒక రోజు అంటే, మే 1న అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలవుతుంది. సాధారణంగా అమెజాన్ తన సేల్‌లో భాగంగా వాషింగ్ మెషిన్లు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందిస్తుంది. అయితే ఈ సారి వీటిపై డిస్కౌంట్లతో పాటు ప్రత్యేకంగా స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు ఉంటాయని ప్రకటించింది.
ఈ సేల్‌లో భాగంగా ICICI, వన్ కార్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్/క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు కూడా అందుబాటులో ఉంటుంది. కొనుగోలు సమయంలో మొదటి ఆర్డర్‌ను ఫ్రీగా డెలివరీ చేయడంతో పాటు వెల్కమ్ రివార్డ్ పేరిట 20 శాతం క్యాష్ బ్యాక్ కూడా ఇస్తామని అమెజాన్ పేర్కొంది. ఇంకా ఆకర్షణీయమైన EMI ఎంపికలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా OnePlus, Redmi, Samsung, టెక్నో, ఐఫోన్ వంటి టాప్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లపై తగ్గింపులు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌కు చెందిన అలెక్సా ఉత్పత్తులు, ప్రముఖ బ్రాండ్లకు చెందినటువంటి ఫ్యాషన్ ఉత్పత్తులు, ఇంటికి అవసరం అయ్యే వస్తువులు, స్మార్ట్‌టీవీలు మొదలగు వాటిని ఈ సేల్‌లో భారీ తగ్గంపుతో కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు మరో ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ కూడా సమ్మర్ కోసం బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. ఇది మే 3 నుంచి ప్రారంభమై 9 వరకు ఉంటుంది.