రూ.10 వేల కోట్లకు పైగా లాభాల్లో ICICI బ్యాంక్

ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ శనివారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

Update: 2024-04-27 12:10 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ శనివారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ.10,707 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఇది క్రితం ఏడాది నమోదైన రూ.9,122 కోట్లతో పోలిస్తే 17 శాతం ఎక్కువ. నికర వడ్డీ ఆదాయం రూ.19,093 కోట్లుగా నమోదైంది. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.17,667 కోట్లతో పోలిస్తే 8 శాతం పెరిగింది. బ్యాంకు వడ్డీ యేతర ఆదాయం 15.7 శాతం పెరిగి రూ.5,930 కోట్లకు చేరుకుంది. సమీక్ష కాలంలో బ్యాంక్ కేటాయింపులు సగానికి పైగా తగ్గి రూ.718 కోట్లకు చేరుకున్నాయి.

బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 2.16 శాతంగా నమోదయ్యాయి. నికర ఎన్‌పీఏ గత ఏడాది 0.48 శాతంతో పోలిస్తే 0.42 శాతంగా ఉంది. నిర్వహణ లాభం సంవత్సరానికి 10.5 శాతం వృద్ధి చెంది రూ.15,320 కోట్లకు చేరుకుంది. పీరియడ్-ఎండ్ డిపాజిట్లు రూ.14,12,825 కోట్లు, పీరియడ్-ఎండ్ టర్మ్ డిపాజిట్లు రూ.8,16,953 కోట్లకి చేరుకున్నాయి. బ్యాంక్ ఇన్వెస్టర్లకు 500 శాతం డివిడెండ్ ప్రకటించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.10 డివిడెండ్‌ను అందించనున్నట్లు బోర్డు డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయించారు.

Similar News