రాజేంద్రనగర్‌లో కదలని కారు

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రెండోసారి జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. కేవలం ఆరేండ్లలోనే నగర ప్రజల వ్యతిరేకత అధికార పార్టీకి తగిలింది. ముఖ్యంగా నగరంలోని రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. కనీసం ఇక్కడ ఒక్క సీటులో కూడా టీఆర్ఎస్ ప్రభావం చూపకపోవడం గమనార్హం. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నియోజకవర్గానికి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఓటర్లపై ప్రభావం […]

Update: 2020-12-04 05:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రెండోసారి జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. కేవలం ఆరేండ్లలోనే నగర ప్రజల వ్యతిరేకత అధికార పార్టీకి తగిలింది. ముఖ్యంగా నగరంలోని రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. కనీసం ఇక్కడ ఒక్క సీటులో కూడా టీఆర్ఎస్ ప్రభావం చూపకపోవడం గమనార్హం. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నియోజకవర్గానికి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఓటర్లపై ప్రభావం చూపలేకపోయారు. మొత్తం 5 డివిజన్లు కలిగి ఉన్న రాజేంద్రనగర్‌లో ఎంఐఎం 2 గెలిచింది. మిగతా 3 డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ప్రకాశ్ గౌడ్ పనితీరును నిరసిస్తూ మైలార్‌దేవ్ పల్లి సిట్టింగ్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరడంతోనే ఈ పరిస్థితి నెలకొందని కార్యకర్తలు చెబుతున్నారు.

Tags:    

Similar News