టీఆర్ఎస్ ‘దండుపాళ్యం’ బ్యాచ్‌ను ఎందుకు దింపిందో చెప్పాలి

దిశ, హాలియా: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నాయకుల ఆగాడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, మద్యం, డబ్బులు ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అభివృద్ధి చేసిన పార్టీ అయితే, ఎన్నికల ప్రకటన వెలువడక ముందే నుంచే […]

Update: 2021-04-03 23:55 GMT

దిశ, హాలియా: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నాయకుల ఆగాడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, మద్యం, డబ్బులు ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అభివృద్ధి చేసిన పార్టీ అయితే, ఎన్నికల ప్రకటన వెలువడక ముందే నుంచే నియోజకవర్గంలో దండుపాలెం బ్యాచ్‌ను ఎందుకు దింపింది అని ప్రశ్నించారు. మండలానికో ఎమ్మెల్యేను ఊరికో 20 మంది ఇతర జిల్లాల నాయకులను దించి ప్రజలను మాయమాటలతో డబ్బులతో కోనుకుంటున్నారని తెలియజేశారు.

ఇకనైనా టీఆర్ఎస్ నేతలు చేసే ఆగడాలు ఆపకపోతే, కాంగ్రెస్ పార్టీ చేతులు కట్టుకుని కూర్చొదని హెచ్చరించారు. జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అధికార పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారు చేసిన అభివృద్ధి చూపించుకునే మొహం లేక డబ్బులతో, అధికార దాహంతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సాగర్ నియోజకవర్గంలో తాను పెంచి పోషించిన నాయకులే ఈరోజు నియోజకవర్గ ప్రజలను కులాలుగా మతాలుగా విడదీసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News