తెలంగాణ ప్రజలకు నాకు మధ్య గ్యాప్ రావడానికి కారణం అదే.. తమిళి సై కీలక వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సంగారెడ్డిలో విశిష్ట సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

Update: 2024-05-04 11:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సంగారెడ్డిలో విశిష్ట సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు నాకు మధ్య గ్యాప్ సృష్టించింది బీఆర్ఎస్ నేతలే అని ఆరోపించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించడానికి అనేక విధాలుగా ప్రయత్నించానని తెలిపారు. కానీ, ఒక్కసారి కూడా నా ప్రయత్నానికి నాటి బీఆర్ఎస్ సర్కార్ సహకరించలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందించడమే తన లక్ష్యమన్నారు.

రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో తనకే తెలియదని ఎద్దేవా చేశారు. తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పి కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగాలని సూచించారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి అభ్యర్థి అర్హత ఎవరికీ లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, తమిళిసై సౌందరరాజన్ లోక్‌సభ ఎన్నికల ముందు వరకు తెలంగాణ గవర్నర్‌గా పని చేశారు. ఇటీవల ఆమె తన గవర్నర్ పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత తమిళనాడులో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు.


Tags:    

Similar News