నల్లని నాజూకు కురుల కోసం ఈ చిట్కాలు

దిశ, వెబ్ డెస్క్ : ఎవరైనా పొడుగు జుట్టున్న అమ్మాయి కనిపిస్తే చాలు నాకు అంత లావుగా పొడువుజుట్టు ఉంటే బాగుండూ అనుకుంటారు అమ్మాయిలు. పొడుగు జుట్టుకోసం వారు పడే ఆరాటం అంతా ఇంతా కాదు మరి. కొంత డాండ్రఫ్ అయితే చాలు.. ఇక వారి బాధ వర్ణనాతీతం. జుట్టు పెరగడానికి, రాలకుండా ఉండడానికి శత విధాలా ప్రయత్నిస్తారు. ఇలా ఒతైన జుట్టు కావాలనుకునే వారికోసం ఈ చిన్న చిట్కాలు. పాలకూర.. జుట్టు రాలడాని ఐరన్ లోపం […]

Update: 2021-04-09 22:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఎవరైనా పొడుగు జుట్టున్న అమ్మాయి కనిపిస్తే చాలు నాకు అంత లావుగా పొడువుజుట్టు ఉంటే బాగుండూ అనుకుంటారు అమ్మాయిలు. పొడుగు జుట్టుకోసం వారు పడే ఆరాటం అంతా ఇంతా కాదు మరి. కొంత డాండ్రఫ్ అయితే చాలు.. ఇక వారి బాధ వర్ణనాతీతం. జుట్టు పెరగడానికి, రాలకుండా ఉండడానికి శత విధాలా ప్రయత్నిస్తారు. ఇలా ఒతైన జుట్టు కావాలనుకునే వారికోసం ఈ చిన్న చిట్కాలు.

పాలకూర..

జుట్టు రాలడాని ఐరన్ లోపం ఒక కారణం. అందుకే ఐరన్ సంమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండేదానిలో పాలకూర ఒకటి. జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలన్ని పాలకూరలో ఎక్కువగా ఉంటాయి. ఫోలేట్ ఐరన్, విటమిన్- ఏ , విటమిన్- సీ వంటివన్నీ పాలకూర ద్వారా లభిస్తాయి. విటమిన్ ఏ అనేది చర్మగ్రంథులు సెబమ్‌ను ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతుంది. తద్వారా జుట్టు ధృఢంగా మారుతుంది ఒత్తుగా పెరుగుతుంది. ప్రతి రోజు కప్పు పాలకూర తీసుకుంటే రోజుకు సరిపడ విటమిన్ – ఏ లో సగానికి పైగా తీసుకున్నట్టే.

మెంతులు..

మెంతి గింజల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్- కె, విటమిన్- సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాకుండా పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాల నిల్వ కూడా అధికం. మెంతి గింజల్లో అధిక ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం కూడా ఉంటాయి. ఇవి జుట్టు రాలడం మరియు చుండ్రుకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. జుట్టు పొడిబారడం, బట్టతల, జుట్టు సన్నబడటం వంటి వివిధ రకాల జుట్టు సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

చిలగడ దుంప..

చిలగడ దుంపలలోనూ విటమిన్ -ఎ ఎక్కువగా ఉంటుంది. సాధారణ పరిమాణం కలిగిన ఒక దుంపలో సుమారు ఒక రోజుకు అవసరమైన విటమిన్ లభిస్తుంది. ఇందులో బీటా కెరొటిన్ కూడా ఉంటుంది.

Tags:    

Similar News