అక్కడ పెరిగిన పెద్ద పులుల సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అమరారం గ్రామపంచాయతీ అటవీప్రాంతంలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం అమరారం అటవీ ప్రాంతంలోకి గ్రామ పశువుల కాపరి ఎరయ్య తన పశువులను తోలుకువెళ్ళాడు. ఈ క్రమంలో పశువులు మేస్తుండగా జూజల చెరువు వద్ద ఆకస్మికంగా రెండుపులులు పశువుల పై దాడి చేసి ఒక పశువు ప్రాణాన్ని బలిగొంది. అయితే ఈ సంఘటన చూసిన పశువులకాపరి ఎరయ్య అటవీప్రాంతం నుంచి గ్రామంలోకి పరుగులు పెట్టాడు. పులులు […]

Update: 2021-11-12 09:13 GMT

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అమరారం గ్రామపంచాయతీ అటవీప్రాంతంలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం అమరారం అటవీ ప్రాంతంలోకి గ్రామ పశువుల కాపరి ఎరయ్య తన పశువులను తోలుకువెళ్ళాడు. ఈ క్రమంలో పశువులు మేస్తుండగా జూజల చెరువు వద్ద ఆకస్మికంగా రెండుపులులు పశువుల పై దాడి చేసి ఒక పశువు ప్రాణాన్ని బలిగొంది. అయితే ఈ సంఘటన చూసిన పశువులకాపరి ఎరయ్య అటవీప్రాంతం నుంచి గ్రామంలోకి పరుగులు పెట్టాడు. పులులు విషయం విన్న అమరారం గ్రామప్రజలు భయాందోళనకు గురయ్యారు.

వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దాంతో అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలోకి ఎటువైపు వెళ్లిందని పశువులకాపరి ఎరయ్యను అడిగి తెలుసుకోని అటువైపు దిశగా గాలింపు చర్యలు చేపట్టారు. అమరారం గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీప్రాంతంలోకి ఎవరు ఒంటరిగా వెళ్లవద్దని, పినపాక అటవీశాఖ అధికారులు ప్రజలకు సూచించారు.

Tags:    

Similar News