సీబీఎస్ఈ ఫలితాల్లో న్యూ లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థుల ప్రభంజనం

సోమవారం ప్రకటించిన సీబీఎస్ఈ 10వ తరగతి, సీబీఎస్ఈ ప్లస్ 2 పరీక్షా ఫలితాల్లో వైరాలోని న్యూ ఈరా వారి న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.

Update: 2024-05-13 14:00 GMT

దిశ, వైరా : సోమవారం ప్రకటించిన సీబీఎస్ఈ 10వ తరగతి, సీబీఎస్ఈ ప్లస్ 2 పరీక్షా ఫలితాల్లో వైరాలోని న్యూ ఈరా వారి న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీబీఎస్ఈ ప్లస్ 2 ఫలితాల్లో ఈ పాఠశాలకు చెందిన కుర్రా స్వాత్య 500 మార్కులకు గాను 482 (97 శాతం) మార్కులు సాధించి తన ప్రతిభను కనపరిచి జాతీయస్థాయిలో సత్తా చాటింది. అదేవిధంగా కొప్పురావూరి తేజస్విని 95 శాతం, జ్ఞాన ప్రద్యుమ్న 94, బీరెల్లి వెంకట కృష్ణ 93, వడ్డే శ్రీముఖి 91 శాతం మార్కులు సాధించారు. ఈ పాఠశాల సీబీఎస్ఈ ప్లస్ టు ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించింది. మొత్తం 66 మంది మంది విద్యార్థుల్లో 65 మంది మొదటి శ్రేణిలో, ఒక విద్యార్థి ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. 10వ తరగతి ఫలితాల్లో కూడా ఈ పాఠశాల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. తేజ్ చరణ్ 500 మార్కులకు

    గాను 488 మార్కులతో (98 శాతం) ఉత్తీర్ణత సాధించారు. కె. ఈశ్వర్ 96, భూక్య ఠాగూర్ 95, ఎ. అన్సిక 95, వై. తొషిని శ్రీలక్ష్మి 94, టి. వివేక్ నందు 94, బి. సాయిచరిత 94, టి. కీర్తన, జి. స్వేఛ్చ, సీహెచ్. యజ్ఞ త్రివేణి, చావా సాయి కృష్ణ లు 92, యు. అక్షరసిరి, డి. ఉజ్వల్ చౌదరి, ఎ. గౌతమ్ కుమార్ 91, ఎస్. శ్రీజ, జె. వివేక్, ఎ. సాయి ఉజ్వల్ 90 శాతం మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు మాట్లాడుతూ సీబీఎస్ఈ ప్లస్ 2 మొదటి బ్యాచ్ లోనే తమ విద్యార్థులు

     క్రమశిక్షణగా కష్టపడి చదివి జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనపరిచి వైరాకే ప్రత్యేక గుర్తింపు తెచ్చారని కొనియాడారు. అదే విధంగా 10వ తరగతిలో కూడా అద్భుత ఫలితాలు సాధించామన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు, డైరెక్టర్లు డాక్టర్ కాపా మురళీ కృష్ణ, కుర్రా సుమన్, లగడపాటి ప్రభాకార్ రావు స్కూల్ ప్రిన్సిపాల్ షాజీమాథ్యూ, ఏఓ నరసింహరావు, ఉపాధ్యాయులు అభినందించారు.

Similar News