ఆ గుంతలో.. దిగబడ్డ చెక్కర లారీ

దిశ హుజురాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. అంతేగాకుండా రహదారులపై కూడా వరదనీరు ప్రవహించి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించాయి. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో 26వ వార్డులో సూపర్ బజార్ రోడ్డుకు మిషన్ భగీరథ పైప్ లైన్లు తీసి, పూడ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మెత్తబడి, చక్కెర లారీ దిగబడింది. 50 మీటర్ల […]

Update: 2020-08-17 07:04 GMT

దిశ హుజురాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. అంతేగాకుండా రహదారులపై కూడా వరదనీరు ప్రవహించి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించాయి. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో 26వ వార్డులో సూపర్ బజార్ రోడ్డుకు మిషన్ భగీరథ పైప్ లైన్లు తీసి, పూడ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మెత్తబడి, చక్కెర లారీ దిగబడింది. 50 మీటర్ల వరకు రోడ్డు కుంగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

Tags:    

Similar News