బిగ్ బ్రేకింగ్ : స్కూళ్ల రీ ఓపెన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని స్కూళ్లలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 1నుంచి స్కూళ్లు యథాతధంగా తెరిచేందుకు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు గురుకులాలు మాత్రం మూసివేయాలని నిర్ణయించింది. హైకోర్టు తెలిపిన ఆదేశాల ప్రకారం స్కూళ్లలో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని స్పష్టం చేసింది. దీంతో రేపటి నుంచి బడులు తెరుచుకోనున్నాయి.

Update: 2021-08-31 06:38 GMT

Tags:    

Similar News