తెలంగాణ ప్రభుత్వం నుంచి DAO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది..Latest Telugu News
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 53 డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం పోస్ట్లు: 53.
గ్రేడ్-II వర్క్స్ అకౌంట్స్
మల్టీ-జోన్-I : 28
మల్టీ-జోన్-II : 25
దరఖాస్తు ప్రారంభ తేదీ: 17-08-2022.
చివరి తేదీ: 06-09-2022.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ.
వయస్సు: 18 నుంచి 44 సంవత్సరాలు.
పే స్కేల్: రూ. 45,960 – రూ. 1,24,150.
అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.tspsc.gov.in/ వెబ్సైట్లో చూడొచ్చు.