Wimbledon 2022 : సెమీస్‌లో నిష్క్రమించిన సానియా జోడీ..

దిశ, వెబ్‌డెస్క్ : కెరీర్‌లో ఆఖరి వింబుల్డన్‌ ఆడుతున్న - Sania Mirza ends Wimbledon career with hard-fought semifinal loss in mixed doubles event

Update: 2022-07-07 10:12 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కెరీర్‌లో ఆఖరి వింబుల్డన్‌ ఆడుతున్న భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా సెమీస్‌లో నిష్క్రమించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన సెమీ ఫైనల్స్‌లో సానియా – పవిచ్ జోడీ 6-4, 5-7, 4-6 స్కోర్ తేడాతో ఆమెరికన్‌-బ్రిటిష జంట – బ్రిట్సీ జోడీ డెసిరే క్రాజిక్, నీల్ స్ముప్స్కీ జంట చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను సులువుగా నెగ్గిన సానియా జోడీ రెండో సెట్‌లో 2-0 తో ఆధిక్యం సాధించి సులభంగా మ్యాచ్ గెలిచేలా కనిపించింది. కానీ ప్రత్యర్ధి జంట రెండో సెట్‌తో పాటు మూడు సెట్ నెగ్గి సానియా జోడీని ఓడించింది. దీంతో కేరీర్‌లో ఆఖరి వింబుల్డన్ ఆడుతున్న సానియా ఒక్క మిక్స్‌డ్ డుబుల్స్ టైటిల్ కూడా గెలవకుండానే కేరీర్‌కు ముగింపు పలుకనుంది.

వింబుల్టన్ మిక్స్‌డ్‌లో సానియా సెమీ ఫైనల్స్ వరకూ రావడం ఇదే తొలిసారి. అయితే వింబుల్డన్ మినహా సానియా ఖాతాలో మిగిలిన మూడు గ్రాండ్ స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ (యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఉన్నాయి. మొత్తంగా సానియా ఖాతాలో ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ సీజన్‌‌లో ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌ తర్వాత సానియా మీర్జా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News