Samsung 5G కొత్త మోడల్ Galaxy M33 .. ఫీచర్స్ అదుర్స్

దిశ,వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం Samsung తన Galaxy సిరీస్‌లో..telugu latest news

Update: 2022-03-27 11:31 GMT

దిశ,వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం Samsung తన Galaxy సిరీస్‌లో భాగంగా కొత్తగా M33 5G ఫోన్‌ను విడుదలచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఏప్రిల్ 2 న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. హ్యాండ్‌సెట్ 5nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 25W చార్జింగ్‌కు సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ అమ్మకానికి సంబంధించి ముందుగా తెలుసుకొడానికి అమెజాన్‌లో 'నోటిఫై మి' ఆప్షన్‌పై క్లిక్ చేసే అవకాశం ఉంది.



 Samsung Galaxy M33 5G స్పెసిఫికేషన్స్

-స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

-ఆండ్రాయిడ్ 12 ఆధారిత One UI 4.1 పై రన్ అవుతుంది.

-గెలాక్సీ M33 5G క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

-50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, రెండు 2-మెగాపిక్సెల్ మాక్రో, డెప్త్ కెమెరాలు ఉంటాయి.

-సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

-ఫోన్ 6GB + 128GB, 8GB + 128GB వేరియంట్‌లలో లభిస్తుంది.

-25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది.

స్మార్ట్ ఫోన్ ధర ప్రకటించలేదు. విడుదల సమయంలో పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.




 


Tags:    

Similar News