AP Politics: విశాఖ లో దళిత రెల్లి యువకుడిని హత్య చేస్తే అరెస్టు చేయారా?

విశాఖపట్టణంలో ఒక దళిత యువకుడిని సినీ ఫక్కీలో వైసీపీ నాయకులు రాళ్లతో కొట్టి చంపేతే ప్రధాన నిందితురాలిని అరెస్టు చేయారా అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నేతృత్వంలో కూటమి పక్షాలు నేతలు ప్రశ్నించారు.

Update: 2024-04-30 11:00 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్టణంలో ఒక దళిత యువకుడిని సినీ ఫక్కీలో వైసీపీ నాయకులు రాళ్లతో కొట్టి చంపేతే ప్రధాన నిందితురాలిని అరెస్టు చేయారా అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నేతృత్వంలో కూటమి పక్షాలు నేతలు ప్రశ్నించారు. నేరం చేసింది వైసీపీ నాయకురాలు విజయ లక్ష్మి అని చెప్తున్నా.. ఈరోజుకి చర్య తీసుకోలేదని విలేకరుల సమావేశంలో ఆరోపించారు. "అంటే వైసిపి వాళ్ళు ఏ నేరం చేసినా సరే చెల్లుబాటు అవుతుందా? రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? వైసీపీ రౌడీ రాజ్యాంగం నడుస్తుందా? ప్రజలే తెలుసుకోవాలి." అని అన్నారు.

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో అమరేశ్వర్ అనే దళితుడిని మీసాల విజయలక్ష్మి అనే వైసీపీ నాయకురాలు రాళ్లతో కొట్టి చంపించందని, ఆరిలోవ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారని చెప్పారు. సెక్షన్ 302 120/బి అనేక సెక్షన్ లు పెట్టారని, ఏ 1 ముద్దాయిని కాపాడుతున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మిత్రుడు జీవీలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దళితుడు హత్య విషయంలో ఎంవీవీ, జీవీల ద్రోహం దళితులు గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

వైసీపీ పార్టీ సమాధానం చెప్పాలి

ఒకపక్క దళితుల ప్రాణాలు తీస్తూ, దళితులకు మేలు చేస్తామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి, నిజంగా నీ దగ్గర చిత్త శుద్ధి ఉంటే విశాఖలో రెల్లి కులానికి చెందిన దళితుడిని చంపిన నీ వైసీపీ నేతలకు ఏం శిక్ష వేస్తావ్ అని ప్రశ్నించారు. ఇప్పటికే దళితుడికి శిరోమండనం చేసినటువంటి తోట త్రిమూర్తులుకి టికెట్ ఇచ్చి.. దళితుడిని హింసించిన వాళ్లకే నా పార్టీలో చోటు అని చెప్పారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇప్పుడు ఒక దళిత యువకుడిని రాళ్లతో కొట్టి చంపినటువంటి నీ వైసీపీ నేతలకు ఏం శిక్ష వేస్తారని నిలదీశారు.

విశాఖలో దళితులకి ముఖం ఎలా చూపిస్తారు?

వైసీపీ ఎంపీ దళితుల ఆస్తిని కాజేస్తేనే ఏం చేయలేకపోయారని విమర్శించారు. తన ఆస్తికి వాస్తుకు అడ్డొచ్చిందిని ఒక కూడల్ని మూసేస్తే ఏం చేయలేకపోయారని అన్నారు. దళితులు అంటే చాలా ప్రేమ ఉందని కల్లబొల్లి కబుర్లు చెప్పే ముఖ్యమంత్రికి, వైసీపీ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదని అన్నారు. జన సేన అధినేత పవన్ కళ్యాణ్‌కి రెల్లి కులస్తులు అంటే అపారమైన గౌరవమని, విశాఖలో జరిగిన రెల్లి కుల యువకుడు హత్యపై ఆయన పోరాడతారని చెప్పారు.

ఈ అంశం మీద ఎన్నికల సంఘానికి, జాతీయ ఎస్.సి కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నిందుతులిని కఠినంగా శిక్షించే దాకా పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలోకంచర్లఅచ్యుతరావు, టీడీపీ జోన్1 మీడియా ఇంచార్జి పోతన్నరెడ్డి, బీజేపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి శ్రీరాజా మురళి మోహనరాజ, జనసేన ప్రాంతీయ సమన్వయకర్త నాగలక్ష్మి, పోతు వెంకట ప్రసాద్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Similar News