రవితేజ సినిమాలో సీనియర్ హీరోకు అదిరిపోయే పాత్ర!
దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అలాంటి వేణు చివరిగా దమ్ము, రామాచారి సినిమాల్లో కనిపించి ఆకస్మాత్తుగా కనుమరుగయ్యాడు. దాదాపు 10 ఏళ్లు తర్వాత వేణు రవితేజ 'రామారావు ఆన్‌డ్యూటీ' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి సంబంధించి వేణు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో వేణు సీఐ మురళిగా కనిపించనున్నాడు.
ఈ సందర్భంగా వేణు సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. ''చాలా కాలం తర్వాత మళ్లీ నటించడం ఎలా ఉందని ప్రశ్నించగా.. తానేప్పుడు సినిమాలకే ప్రాధాన్యత ఇస్తానన్నాడు. చాలా రోజుల తర్వాత నటించడం ఎంతో ఆనందంగా ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాలకు దూరం అయ్యాను. మళ్లీ ఇంత కాలానికి రవితేజ 'రామారావు ఆన్‌డ్యూటీ' లో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను సీఐ పాత్రలో కనిపిస్తాను. దీనికి సంబంధించిన పోస్టర్‌ను నిన్న(జులై 6)న మేకర్స్ రిలీజ్ చేసిన విషయం మీకు తెలిసిందే'' అంటూ ముచ్చటించాడు.