ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు. మే 9 నుంచి ఫస్ట్ ఫేజ్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. కాగా ఈనెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. కాగా జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. కాగా జూన్ 30వ తేదీలోపు తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు అధికారులు స్పష్టంచేశారు. పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాల కోసం ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకూడదని కాలేజీలకు ఇంటర్ బోర్డు అధికారులు హెచ్చరించారు. ఇతర వివరాలకు acadtsbie.cgg.gov.in లేదా tsbie.cgg.gov.in అనే వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు.