రాజమౌళి తండ్రికి కేంద్రం బంపర్ ఆఫర్..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి కోటాలో ఖాళీగా ఉన్న రాజ్యసభ

Update: 2022-07-06 15:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి కోటాలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు దక్షిణాది నుండి నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్ చేసింది. ఇందులో ప్రముఖ సంగీతకారుడు ఇళయరాజా, పీటి ఉష, వీరేంద్ర హెగ్డే, డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌లను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'శ్రీ వి.విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక రంగంతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. అతను రాజ్యసభకు నామినేట్ అయినందుకు నా అభినందనలు' అని  ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఒకేసారి నలుగురు దక్షిణాది వారికి రాజ్యసభలో స్థానం కల్పించడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ దక్షిణాదిలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Similar News