మా భూమిని మాకు ఇప్పించండి అంటూ.. తహశీల్దార్ ఆఫీస్ ఎదుట నిరసన

Update: 2022-02-14 12:14 GMT

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా బైంసా మండలం మహాగాం గ్రామంలో సర్వే నంబర్-218 లో గల 32 ఎకరాల భూమిని దళితులకు పంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట టెంట్ వేసుకుని నిరసన చేపట్టారు. భూమి రాని దళితులకు అక్కడ భూమిని కేటాయించాలి. కానీ దళితులు అయినా మాకు కాకుండా కొంతమంది ధనవంతులు, పలుకుబడిన వారు ఆ భూములను కబ్జా చేస్తున్నారన్నారు. 32 ఎకరాల భూముల్లో అక్రమ సాగుదారులు వెళ్లగొట్టి, ప్రభుత్వం మిగులు భూమిగా గుర్తించి పేద దళితులకి ఆ భూమిని అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నారు. గత 15 రోజుల నుంచి ఈ పోరాటం కొనసాగుతుందని భూములు మాకు ఇచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.

Tags:    

Similar News